![]() |
![]() |
.webp)
జబర్దస్త్ లో, బిగ్ బాస్ లో అందాల అమ్మడు ప్రియాంక సింగ్ సంపాదించుకున్న ఫేమ్ అంతా ఇంతా కాదు. పింకీ సోషల్ మీడియాని కూడా షేక్ చేసేస్తూ ఉంటుంది. హాట్ ఫోటో షూట్స్ తో కిర్రాక్ పిక్స్ తో యూత్ కి నిద్ర లేకుండా జాగారం చేయించడంలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అలాంటి ప్రియాంక ఇప్పుడు ఒక బ్లాస్ట్ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఆ వీడియో చూస్తే ఆర్జీవీ కూడా ఐస్ లా మెల్ట్ అవ్వాల్సిందే అన్నట్టుగా ఉంది పింక స్ట్రక్చర్...బాతు టబ్బు షవరులో రెడ్ వైన్ గ్లాస్ తో మత్తెక్కించే కళ్ళతో హాలీవుడ్ హీరోయిన్ రేంజ్ లో పాప కూల్ వెదర్ లో హాట్ గా ఫోజులిచ్చింది.
"నేనేం ఏం చేసినా తప్పుగా అంటున్నారు..ఇదే నా పని అండి..నేను ఇదే చేయగలను. మీరు మీ జాబ్స్ ఎలా చేస్తారో నేను కూడా అంతే. ఇది ఒక ప్రైవేట్ సాంగ్ కి సంబంధించిన షూటింగ్. త్వరలో మీ ముందుకు రాబోతోంది. మీరంతా చూస్తారని ఆశిస్తున్నాను ...మీరేమనుకున్న సరే అందరికి సమాధానాలు ఇవ్వలేకపోతున్నా. మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను" అని కామెంట్ పెట్టింది. బిగ్‌బాస్‌లోకి వెళ్లిన పింకీ తన ఆట తీరుతో ఆడియన్స్ మనసులు గెలుచుకుంది. హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకుంది. మానస్ నాగులపల్లి అంటే చాలా ఇష్టం కానీ అతను మాత్రం ఆమెను అస్సలు పట్టించుకోలేదు. ఇక నెటిజన్స్ ఐతే "కళ్ళు చెదిరే అందం...హాట్ బ్యూటీ...హాలీవుడ్ నటిలా ఉన్నారు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
![]() |
![]() |